ఈ రోజు భూమిమీద నీది/నీవాళ్లది చిట్టచివరి రోజు అని భావించండి, నెగటివ్ అన్న ప్రసక్తే రాదు

కొన్ని సంవత్సవరాల క్రితం నేను ఒక యోగ క్యాంపు కు వెళ్ళాను అక్కడ నాతో ఈ విధంగా చెప్పారు

ఈ రోజు భూమిమీద నీది చిట్టచివరి రోజు రేపటినుండి నీకు ఎవ్వరు కనిపించరు మరియు నువ్వు ఎవ్వరు కనిపించరు. నీ మనసులో ఉన్న భావనలను/ఆలోచనలను అన్నింటిని లిఖిత పూర్వకంగా ఒక లెటర్ రాయండి.

తరువాత యోగ క్యాంపు వాళ్ళు సభ్యులందరినీ ఒక్కొక్క దగ్గర నిర్మానుష్యమైన ప్రదేశములో  ఒకరికి ఒకరు కనిపించకుండా ఉంచారు

నేను వ్రాయడము మొదలు పెట్టాను అంతే అప్పటివరకు ఉన్న నెగటివ్ భావనలు మొత్తం పటాపంచలు అయినాయి. చాలా సార్లు కళ్ళనుండి నీళ్లు సుడులు తిరుగుతున్నాయి, ఆ తరువాత నాకు నెగటివ్ అన్న ప్రసక్తే రాలేదు

అలాగా సంవత్సరానికి ఒక్కరోజైనా భూమిమీద నీది మరియు నీ వాళ్ళది (ఒక్కొక్కరిది విడివిడిగా) చిట్టచివరి రోజు అని భావించి చూడండి చాలా సమస్యలు దూరము అవుతాయి, మరియు నీ వాళ్ళ యందు నీ ప్రవర్తన/మనస్తత్వము లో చాలా తేడా ఉంటుంది

 

ఈ క్రింది ఉదాహరణలను తీసుకుందాం, వాళ్ళు గనుక పైన చెప్పిన పద్దతిని పాటించినట్లయితే చివరి క్షణాల్లోఈ పరిస్థితి ఉండేది కాదు

శ్రీరాం సాగర్  అన్నదమ్ములలో పెద్దవాడు. చిన్న తమ్ముడు అంటే ఇష్టం. కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది.

తాను ఇంకొక పది  రోజులలో చనిపోతానని డాక్టర్స్ ఆయనతో చెప్పారు   3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజున ఆయన తన తమ్ముడికి కబురు పెట్టాడు. “40 ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవపడిన విషయం నన్ను కలిచివేస్తోంది. నేను సుఖంగా మరణించలేను . నాలో ఉన్న క్రోధం పోవాలి” అన్నాడు , తమ్ముడు వచ్చాడు. తమ్ముడిని చూడగానే అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని తమ్ముడి తల నిమురుతూ “ఆ గోడ పడగొట్టేయ్యి” అన్నాడు. అన్నదమ్ములిద్దరూ భోరున విలపించారు. తమ్ముడి చేతిలో ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు అన్న

ఒక  హాస్య నటుడు తడ్రితో గొడవ పది ఆయనతో మాట్లాడ్డం మానేసాడు, ఆలా ఆలా రోజులు గడుస్తూ 40  సంవత్సరాలు గడిచింది, ఒక రోజున అతనికి కబురు అందింది మీ నాన్నగారు గతించారు అని, అప్పుడు ఇంటికి వచ్చాడు ఆ హాస్య నటుడు, అంతిమ యాత్రకు బయలుదేరేముందు కొడుకు తండ్రి చెవులో నాన్న అని పిలవాలి కదా, 40 సంవత్సరాల తరువాత అప్పుడు పిలిచాడు, నాన్న నాన్న అని, ఒకసారి కాదు కొన్ని వందల సార్లు పిలిచాడు ఆయన ఏమి లాభము. ఆ హాస్య నటుడు తరువాత ఈ విషయాన్నీ  చెప్పి మీకు ఎవరికీ కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు  అని చెప్పి, ఏదైనా ఉంటె వెంట వెంటనే తేల్చుకొమ్మని చెప్పాడు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.