టెర్రస్ గార్డెన్ / డాబాపైన చెట్ల పెంపకం

 

 • వంటింట్లో విషాహారం
 • కూరగాయల్లో పురుగుమందులు
 • ఆరోగ్యంపై చెడు ప్రభావం
 • రోజు ఇట్లాంటి వార్తలు చదువుతాము, ఒక్క నిమిషము ఆలో చిస్తాము, ఏదేదో చెయ్యాలని అనుకుంటాము, మనలో మనమే తిట్టుకుంటాము, కొద్దీ సేపటి తరువాత మరచిపోతాము.
 • మనము మన పిల్లలకు ఆస్తులు ఇచ్చిన ఇవ్వకున్నా మంచి ఆరోగ్యము,మంచి నడవడిక, మంచి చదువు మాత్రము తప్పకుండ ఇవ్వాలి.
 • మంచి ఆరోగ్యము ఇవ్వాలంటే కలుషితము కానీ ఆహారము ఇస్తే చాలు. మరి అట్లాంటి దాని కొరకు ఏమి చేస్తున్నాము.బియ్యము, పప్పులు మనచేతులో లేదు ఎవరో పండించిన దాన్ని తినాలి, తప్పదు. కానీ కూరగాయలను మనమే పండించుకోవొచ్చు కదా. అది కూడా మన మిద్దె పైననే.
 • మొదట వచ్చే సందేహము
  • (1) మిద్దె పైన బరువు ఎక్కువ అవుతుంది కదా :- ఒక ప్లాస్టిక్ కుండీ + మట్టి మిశ్రమం తో కలిపి ఇరవై (Approx) kgల బరువు ఉంటుంది ఒక మనిషి 60 kgల బరువు ఉంటాడు అంటే ఒక మనిషి నిలపడ్డ స్థలములో మూడు కుండీలను పెట్టవచ్చు.
  • (2) నీళ్లు కారుతాయి కదా:-. కుండీనుండి బైటకు వచ్చే నీటిని ఒక పైప్ కు అమర్చి డాబా పైన పడకుండా ఏర్పాటు చేసుకోవొచ్చు
  • ఎంత ఖర్చు అవుతుంది,
  • టైం లేదు కదా,
  • ఏఏ వస్తువులు కావాలి &
  • ఎక్కడినుంచి తీసుకు రావాలి
  • ఎవరు తీసుకురావాలి.
  • కావాల్సిన వస్తువులన్నింటిని మీ ఇంటి వరకు తెచ్చి వాటిని క్రమపద్ధతిలో పేర్చి ప్రతి పదిహేను రోజులకొకసారి మీఇంటికి వచ్చి మొక్కలను పర్వ్యవేక్షన చేసేవారు కూడా ఉన్నారు
 • ఇరవై (20) మొక్కలకు ప్లాస్టిక్ పేపర్ కుండీ + మట్టి మిశ్రమం తో కలిపి 8,000/- (Approx) అవుతాయి
  • మట్టి మిశ్రమం ఎర్ర మట్టి+ కొబ్బరి చిప్ప పొడి (coco peat) + వేప పొడి+కంపోస్ట్ తో తయారు చేస్తారు. వివిధ మొక్కలు & అవసరమైన కుండీలు:-  పాలకూర-3, మెంతి కూర-3, తోట కూర-3, బచ్చలి -3, టమాటా- 3, పచ్చిమిర్చి-2, కొత్తిమీర 2, పుదీనా -1
 • మాది ఉమ్మడి కుటుంబం, మా ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఉంటాము గత మూడు నెలలుగా మేము ఆకుకూరలను బైట కోనట్లేదు
 • మైంటెనెన్సు చేసేవాళ్ళు కూడా ఉన్నారు వారిని సంప్రదించినట్లు అయితే వాళ్ళు ప్రతి పదిహేను రోజులొక కొకసారి సేంద్రియ ఎరువు + సేంద్రియ స్ప్రే + జీవామృతం మొదలగు నవి మీఇంటికి వచ్చి ప్రతి చెట్టుకు అవసరాన్ని బట్టి ఉపగోయించడము జరుగుతుంది

 


 


Be the first to comment

Leave a Reply

Your email address will not be published.