ఆధ్యాత్మికత, వేదాంతం మరియు వ్యక్తిత్వ వికాసం & అభివృద్ధి

ఆధ్యాత్మికత, వేదాంతం మరియు వ్యక్తిత్వ వికాసం & అభివృద్ధి

దీని అర్ధము ఎంతమందికి తెలుసు?
దేవుడు దైవం మాత్రము కాదు మరి ఏంటి

ఆధ్యాత్మికత :- ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవడము
వేదాంతం :- జ్ఞానం కోసం అన్వేషణ
వ్యక్తిత్వ వికాసం & అభివృద్ధి :- మనిషి లోని ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తనల గురించి తెలుసుకోవడము మరియు అవసరమైన మార్పులను సూచించడము

ఓ…….. ప్రొద్దటి నుండి రాత్రి వరకు టీవీ లో ప్రవచనాలు వింటూనే ఉంటాము చూస్తూనే ఉంటాము రకరకాల పుస్తకాలు, వ్యాసాలు, గ్రంధాలు చదువుతూనే ఉంటాము.

ఏ ఒక్కరైనా కూడా సుమతి శతకం వేమన శతకం గురించి చెప్పిన వారు ఉన్నారా ?
ఉండరు , ఎందుకంటే వాటిగురించి చెపితే వారి వారి గొప్పతనం తగ్గిపోతుంది కదా .
నా ఉద్దేశ్యము ప్రకారము అన్నింటి సారాంశమే సుమతి శతకం వేమన శతకం
ఎవ్వరు ఏది చెప్పినా వ్రాసినా వాటిలో ఉన్న నీతి సూక్తాలను మార్చి మార్చి చెపుతువుంటారు తప్ప కొత్త వాటిని చెప్పరు

తెలుసుకుంటూనే ఉంటాము మరి ఎంతమంది పాటిస్తున్నారు ?
ఎప్పుడు పాటిస్తున్నారు ?
ఒక్కటైనా పాటిస్తున్నారా ?

దీన్ని (సూక్తిని నియమాన్ని ఆదర్శాన్ని పద్దతిని ) నేను పాటిస్తున్నాను అని రాసుకోండి, పాటిస్తున్నానా లేదా అని గమనించండి
ఆతరువాతనే ఇంకో కొత్త దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నము చేయండి
లేదా జీవితకాలం తెలుసుకుంటూనే ఉంటారు తప్ప ఏ రోజు కూడా ఏ ఒక్క దాన్ని కూడా పాటించరు

1 Comment

Leave a Reply

Your email address will not be published.