నా అనుభవాలు డైట్ మొదలు నుండి పూర్తి వరకు

గమనిక

 • మూడునెలల తరువాత నాకు రీడింగ్స్ నార్మల్ గ వచ్చాయి అంటే మీకు కూడా రావాలని ఈ విధమైన రూల్ లేదు.
  రీడింగ్స్  వారి వారి మెటబాలిజం పై ఆధారపడి ఉంటుంది.
 • మీరు ఎప్పుడు డైట్ మానెయ్యాలో మరియు ఏమి తినాలో  మీ డాక్టర్ ను సంప్రదించి వారి సూచనమేరకు పాటించండి

వీరమచనేని రామకృష్ణ గారి ప్రేరణ తో 19/జనవరి /2018 నాడు డైట్ ప్లాన్ మొదలు పెట్టాను. పీవీ సత్యనారాయణ గారి మార్గదర్శకత్వం లో వారు చెప్పిన టెస్టులు అన్ని చేయించాను, వారి సలహాలను పాటిస్తూ ఈరోజు ఈ రోజు 05 /మే/ 2018 నాడు నేను నా డైట్ పూర్తి చేసాను.

నేను డైట్ మొదలు పెట్టిన పదిహేను రోజుల తరువాత నాకు వంటినిండా కురుపులు అయ్యాయి, నా అవగాహనా లోపం వల్ల భయపడి డైట్ మానేద్దామనుకొని అన్నం తిన్నాను తరువాత షుగర్ టాబ్లెట్ కూడా వేసుకోవడము మొదలుపెట్టాను. అప్పుడు ఇంట్లో ఒక తుఫానుకు కు ముందు వాతావరణము లాగ ఉన్నది, నా కూతుళ్లు నా దగ్గరికి వచ్చి నాన్నా డైట్ పడలేదు మానేసావు పరవాలేదు కానీ దయచేసి నీ టాబ్లెట్ డోస్ మాత్రము పెంచుకోకు అని అన్నారు, నాకళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, నాకు ఏమి మాట్లాడాలో అర్ధంకావట్లేరుడు తెల్లవారి సోమవారం ఆఫీస్ కు వెళ్ళాను, ఆఫీస్ లో నా సహచరుడు (ఫణి) రామకృష్ణ గారు కురుపులు వస్తాయని చెప్పిన విషయాన్నీ చెప్పి నీకు ఇది కూడా తెలియదా అని నానా తిట్లు తిట్టి, నన్ను మళ్ళీ తిరిగి డైట్ మొదలు పెట్టేటట్లు చేసాడు.

ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే మార్గంలో మళ్ళి సంబంధిత వీడియో చూసాను, ఇలా డైట్ బ్రేక్ చేస్తే ఒక పది రోజులు లిక్విడ్ డైట్ చేయాలని చెప్పారు, వెంటనే చాలా సంతోషంగా వేయి ఏనుగుల బలంతో ఒక పదిరోజులు లిక్విడ్ డైట్ పూర్తి చేసి ఈ రోజు(05 /మే/ 2018 ) న మొత్తం డైట్ పూర్తి చేయకలిగాను.

ఈ డైట్ మొదలు పెట్టినదగ్గరినుండి కొందరు ఆందోళన పడేవారు, కొందరు ప్రశ్నించేవారు ,కొందరు సలహాలిచ్చేవారు , కొందరు అపహాస్యం చేసేవాళ్ళు, కొందరు విమర్శ చేసేవాళ్ళు
కొందరు అబ్బెబ్బే దేనివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు అని అనేవారు, కొందరు ఇట్లా బరువు తగ్గడము మంచిది కాదు అనేవారు, కొందరు షుగర్ కు మందులేదు నీ కిడ్నీలు పాడవుతాయి అనేవారు , కొందరు నాతో అనవసరంగా వాదన పెట్టుకునేవారు, వేరే మధుమేహవ్యాధిగ్రస్థులు మేము టాబ్లెట్స్ వాడుతున్నాము మరి మేము తప్పుచేస్తున్నామంటావా అని నాతో వితండ వాదం పెట్టుకునేవారు. నేను అందరికి ఒకటే సమాధానము ఇచ్చేవాడిని మా డాక్టర్ చెప్పినట్లు వినాలా మీరు చెప్పినట్లు వినాలా అని., అప్పుడు కూడా మరి మా డాక్టర్లు ఇట్లా చెప్పలేదుకదా అని అనేవారు. నెమ్మదిగా అక్కడినుండి వెళ్లిపోయేవాడిని.

మా అమ్మ గారు నా పైన కొంచెం బెంగ పెట్టుకునే వారు, కొంచెం అన్నం తినురా లేకపోతే ఒక్క చపాతీ తినురా అని బ్రతిమిలాడేది అప్పుడు నేను మా అమ్మ గారితో నేను కొంచెం కఠినంగా మాట్లాడవలిసి వచ్చింది అందుకు నేను క్షంతవ్యుణ్ణి,

అన్నింటిని ఎదుర్కొన్నాను ఆఖరుకు నేనే గెలిచాను కాదు కాదు వీరమచనేని రామకృష్ణ గారు గెలిచారు.

ఈ మూడునెలల కాలంలో నేను జలుబు, దగ్గు జ్వరము లాంటి చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండాచూసుకున్నాను ఎందుకంటే ఈ డైట్ వల్ల వస్తుంది అని అంటారేమోనన్న భయంతో

క్రింది ఫోటో లో చూపిన విధంగా, చక్కటి ఆహారాన్ని తిన్నాను
మొలకలు, డ్రై ఫ్రూట్ రోటి, వంకాయ మసాలా కూర, బెండకాయ కూర, దోసకాయ పెసరు పప్పు , అప్పడం, చల్లమిరపకాయ, మామిడికాయ రసం, పెరుగు, ఆవకాయ, ఒక పెద్ద కప్ కొర్రబియ్యం.

 • నా షుగర్ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి
 • భోజనానికి ముందు 12 .25 87

 

 

 • భోజనము 01 05 కు పూర్తి అయ్యిన్ది

 

 

 • భోజనము తరువాత 01 40 115
 • భోజనము తరువాత 02 05 130
 • భోజనము తరువాత 02 40 123
 • భోజనము తరువాత 03 10 151

దేన్ని బట్టి నాకు మధుమేహము నుండి విముక్తి లభించనుందనిపిస్తుంది.ఈ రోజు నుండి నేను ప్రతి రోజు షుగర్ చూసుకుంటూ ఉంటే శాశ్వతంగా పోయిందా లేదా తాత్కాలికంగా పోయిందా అనేది తెలుస్తుంది


మధుమేహము పోయింది కదా ఎందుకు కొర్రబియ్యాన్నే తినాలి ?

బాలింత సమయంలో తల్లులు చాలా ఆహార నియమాలు పాటిస్తారు ఎందుకు?
కొన్ని తప్పకుండా తినాల్సినవి కొన్ని అస్సలు తినకూడనివి ఉంటాయి.
ఈ నియమాన్ని ఒక్కొక్కరు వారి వారి అవసరాన్ని బట్టి ఒకనెల నుండి ఆరు నెలల వరకు పాటిస్తారు.

కాలు విరిగిన తరువాత ఇరవై రోజులు కట్టు కడతారు, కట్టు తీసిన తరువాత మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఇంకో ఇరవై రోజులు సాధన చేస్తారు అవసరము అయితే ఫీజియోథెరఫీ చేయించుకుంటారు, ఎందుకు?

పైదాన్ని బట్టి ఏమి అర్ధము అయ్యిన్ది, మధుమేహతో బాధపడేవారు ఈ డైట్ అయినతరువాత కూడా కొన్ని ఆహార నియమాలను పాటించాలన్నట్టు.
వారి అవసరాన్ని బట్టి వారి వారి మెటాబాలిజంను బట్టి ఒక పద్దతి ప్రకారము తినాలి లేకపోతే మల్లి మధుమేహము రావొచ్చు.
నేను ఇంకొక మూడు నెలల వరకు కొర్రబియ్యాన్నే తినాలని నిర్ణయించుకున్నాను.


ఈ సందర్బంగా నేను ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అది ఎవరంటే మా శ్రీమతి గారు. గత మూడున్నర నెలలనుండి నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ నా గురించే అనుక్షణము పరితపిస్తూ టైం ప్రకారము నాకు ఆహారము సమకూర్చేది

మార్చ్ నెలలో నాకు ఆఫీస్ ప్రొద్దున ఆరు నుండి మధ్యాహ్నము మూడు వరకు ఉండేది, ఆ నెల మొత్తం ప్రొద్దునే మూడు గంటలకు లేచి నాలుగున్నర వరకు వంట చేసేది.
తాను ఏ ఫంక్షన్లకు వెళ్ళలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ వెళ్లినా కూడా, నాకు అన్ని సమకూర్చేది , ఎంత రాత్రిఅయినాసరే తిరిగి ఇంటికి చేరుకునేది ఎందుకంటే తెల్లవారగానే నాకు వంటచేయాలి కదా

మీకు ఇదివరకే చెప్పినట్టు మాది ఉమ్మడికుటుంబం, మా కుటుంబ సభ్యులు అందరికి నా కృతజ్ఞతలు, మా తమ్ముడి కొడుకు 5 సంవత్సరాలు ఉంటాయి వాడు కూడా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళతో “పెదనాన్న అన్నంతినడు షుగర్”అని చెప్పేవాడు. ఈరోజు భోజనానికి కూర్చోగానే వాడు వచ్చి “నీ షుగర్ పోయింది” అని అడిగాడు వాడిని గట్టిగ దగ్గరికి తీసుకొని పోయిందిరా అని చెప్పాను

రామకృష్ణ గారికి, పీవీ సత్యనారాయణ గారికి, మరియు నా శ్రీమతి గారికి నేను నా జీవితాంతం కృతజ్ఞత తో ఉంటూ
సహచరుడు ఫణి ని నేను ఎల్లపుడు గుర్తుంచుకుంటూ

బి రఘు

 

10 Comments

Leave a Reply

Your email address will not be published.