వీరమాచనేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్

 

వీరమాచనేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్ Veeramachaneni Ramakrishna Diet Plan, VRK Diet Plan.


అందరికి నమస్కారములు…

 • నాకు మధుమేహము ఉంది కావున ఆహారము విషయములో మరియు మందుల విషయములో జాగ్రత్తగా ఉండడము నాకు అలవాటు, డాక్టర్ గారి సలహా తో ఆహారాన్ని & మందులను వాడతాను.
 • వీరమచనేని రామకృష్ణ గారి   ప్రేరణ (inspiration/motivation) తో 19/Jan/2018 నాడు  డైట్ ప్లాన్ మొదలు పెట్టాను.  పదిహేను రోజులు గడిచిన తరువాత చాలా అనుమానాలు వచ్చాయి (యూరిక్ ఆసిడ్ ఎక్కువ అవ్వడము………. లాంటివి)
 • రామకృష్ణ గారు కూడా చెప్పారు ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటె డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్ వాడాలని చెప్పారు
 • నా ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఏ  డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి?
 • ఎవరికైతే ఈ   డైట్ మీద అవగాహనా ఉంటుందో ఆయన దగ్గరికి వెళ్ళడము సరైనది అనిపించింది?
 • మరి ఎవరికీ ఉంది దీని పైన అవగాహన?
 • పీవీ సత్యనారాయణ గారిని సంప్రదిస్తే బాగుంటుంది అనిపించింది. అనుకున్నదే ఆలస్యము  పీవీ సత్యనారాయణ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను వారి మార్గదర్శకత్వం (guidance)లో వారు చెప్పిన టెస్టులు అన్ని చేయించాను, వారి సలహాలను పాటిస్తూ  ఈరోజు (12/March)వరకు 53 (Approx)రోజులు  పూర్తి చేయగలిగాను.

చాలా మందికి పరీక్ష చేసుకునేంత వరకు సమస్య ఉందన్న విషయం తెలియనే తెలియదు, అందువల్ల :-

 • మీకు ఏ అనుమానము వచ్చినా రాకున్నా.
 • ఆరోగ్య పరమైన సమస్య ఉన్నా లేకున్నా.
 • మధుమేహము, బీపీ, లాంటి ఎలాంటి సమస్య  ఉన్నా లేకున్నా.
 • దయచేసి డాక్టర్ గారిని సంప్రదించి ఈ డైట్ చేయగలరని నా మనవి
 • ఇంకా కొన్ని రోజుల్లో మధుమేహము /షుగర్  నుండి శాశ్వతముగా నివారణ అవుతుందన్న  నమ్మకము తో. వీరమచనేని రామకృష్ణ గారికి  మరియు పీవీ సత్యనారాయణ గారికి హృదయ పూర్వక నమస్కారములతో.

గమనిక:-

 • దయచేసి డాక్టర్ గారు నాకు ఇచ్చిన మందుల వివరాలు మరియు ఆహారములో మార్పులు ఎవ్వరు కూడా అడుగ వద్దని నా విన్నపము. ఎందుకంటే నా మెటబాలిజం, రక్త పరీక్షలు (బ్లడ్ రిపోర్ట్స్) ఆధారంగా వారు నాకు మార్పులు చేశారు.
 • ఈ డాక్యుమెంట్ లో నేను పాటిస్తున్న విషయాలను మాత్రమే చెప్పాను, నా మెటబాలిజం కు అనుగుణంగా నేను పాటిస్తున్న ఆహార నియమాలను ఇక్కడ ప్రస్తావించడము జరిగింది. మీ మెటబాలిజం కు సూట్ అయ్యే ఆహార నియమాలను, డాక్టర్ గారిని సంప్రదించి పాటించాలని నా మనవి.
 •  దయచేసి ఇవ్వి ఎవ్వరిని/దేన్నీ  ఉద్దేశించి మాట్లాడింది కాదు ఒకరికి సత్ఫలితాన్నిచ్చిన పద్దతి వేరొకరికి ప్రతికూల ఫలితాన్నివ్వొచ్చు

ఇదైనా ప్రక్రియ  మొదలు పెట్టి ఆచరించాలనుకున్నప్పుడు   మనకు ఈ క్రిందివి ఉండాలి

 • Trust నమ్ముట, విశ్వసించుట
 • Confidence నమ్మకము, విశ్వాసము
 • Discipline క్రమశిక్షణ
 • Honesty నిజాయితీ, చిత్తశుద్ధి, సచ్ఛీలత.
 • Sincerity త్రికరణశుద్ధి, నిజము, నిష్కపటము, సద్భావము
  • ఇవ్వి ఎప్పుడు ఉంటాయి ?     ఎంచుకున్న  ప్రక్రియ మీద మనకు సంపూర్ణ   Understanding అవగాహన  ఉన్నప్పుడు మాత్రమే. అందుకోసం దానికి సంబంధించిన అన్ని విషయాలను  మొత్తము సంగ్రహించాలి అది పుస్తకాల ద్వారా, వీడియోల ద్వారా ఇంకా ఎట్లా  అయినా కానీ . సంగ్రహించిన దాన్ని  ఒక కొత్త నోట్ బుక్ తీసుకొని అందులో ప్రతి పాయింట్ రాసుకోవాలి
  • సాధారణంగా అడిగే ప్రశ్నలను ఉదాహరణగా తీసుకొందాము
   • లిక్విడ్ డైట్ నుండి సాలిడ్ డైట్ కు ఎలా మారాలి
   • జ్వరము వస్తే మాత్ర వేసుకోవాలా వద్దా
   • వంట్లో కురుపులు అవుతున్నయ్ ఏమి చేయాలి
   • అంటే  సంపూర్ణ   Understanding అవగాహన  లేకుండానే మొదలు పెట్టారు అన్న మాట .

ఎవరికైనా వీడియోలు చూడుమని సలహా ఇస్తే చెప్పే సమాధానము టైం లేదు. ఒక సినిమా చూస్తాము దానికి మూడుగంటలు టైం పెడతాము, పార్ట్ పార్ట్స్ గ ఉంటె అన్ని పార్ట్శ్ చూస్తాము అట్లాంటిది మన శరీరానికి సంబందించిన ఒక పెద్ద ప్రయోగము దీనికి సంబందించిన సంపూర్ణమైన అవగాహన  తెచ్చుకోవటం మన బాధ్యత. ఎవరో చెప్పారని మాత్రము ఆచరించవద్దు.

 • ఎవరైనా కొండఎక్కండి అని అంటే ఎవ్వరు ఎక్కరు
 • ఎవరైతే ఫస్ట్ వస్తారు వారికి కోటి రూపాయలు ఇస్తారు అని అంటే కొందరు ట్రై చేస్తారు
 • ఎక్కినవారందరికి కోటి రూపాయలు ఇస్తారు అని అంటే అందరూ ట్రై చేస్తారు విజయముతో వస్తారు కూడా.

ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటి? ఇది చేస్తే ఇది అవుతుంది అని ఖచ్చితంగా   ఉంటె ఎవరైనా చేస్తారు. మీరు చేయాల్సింది చేయండి ఫలితము తరువాత చూస్తాము అని అంటే ఎవ్వరు చేయరు. ఇది చేస్తే ఇది అవుతుంది అని ఎప్పుడు చెప్పగలము సంపూర్ణమైన అవగాహన   ఉన్నప్పుడు మాత్రమే

ఒకసారి వీడియో డౌన్లోడ్ చేసుకుంటే, వీడియో చూస్తున్నప్పుడల్లా ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరము లేదు.


సంపూర్ణ అవగాహనా కొరకు, నా అభిప్రాయము ప్రకారము ఈ క్రింది వీడియోలు సరిపోతాయి.

వీరమచనేని రామకృష్ణ గారి   ఇంటర్వ్యూ

 1. https://youtu.be/LF0QiC5ALHw

వీరమచనేని రామకృష్ణ గారి   హైదరాబాద్ జలవిహార్ ప్రోగ్రాం

 1. https://www.youtube.com/watch?v=-_fua9mBv2I&feature=youtu.be
 2. https://www.youtube.com/watch?v=VQnYADuQW-Y&feature=youtu.be

వీరమచనేని రామకృష్ణ గారి   మహా న్యూస్

 1. https://youtu.be/IN3YcgL5BFg
 2. https://youtu.be/8tboN8ff6Ew
 3. https://youtu.be/vo6Z7WlanmE
 4. https://youtu.be/RcRWhmOkaQY

ఈ క్రింది వీడియో లు చూసినట్లైతే చాలా వాటికీ శాస్త్రీయ  సమాధానాలు దొరుకుతాయి డాక్టర్ పీవీ సత్యనారాయణ, కేర్ హాస్పిటల్

 1. Part 1 https://www.youtube.com/watch?v=j-7gMIps1Ic
 2. Part 2 https://www.youtube.com/watch?v=qk6KDVCCy-Q
 3. Part 3  https://www.youtube.com/watch?v=_jsN8iK-Aw8
 4. Part 4 https://www.youtube.com/watch?v=FK6Hv0XDyFk
 5. Part 5 https://www.youtube.com/watch?v=0L5tLmncAEk
 6. Part 6 https://www.youtube.com/watch?v=0GRXX1ty_50
 7. Part 7 https://www.youtube.com/watch?v=M_S2DWopM9s

ఏదైనా  బ్లడ్ రిపోర్ట్ మీద అభిప్రాయము చెప్పేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి  చెప్పండి నెగటివ్ అభిప్రాయమం చెప్పేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి. ఎందుకంటే మనము ఒక మాట అనేస్తాము కానీ అవుతలి వాళ్లకు దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా   అభిప్రాయము చెప్పినట్లైతే దాన్ని శాస్త్రీయంగా తీసుకోకండి, ఎందుకంటే ఈ డైట్ ను సపోర్ట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడండి ఒకరికి సత్ఫలితాన్నిచ్చిన డైట్‌ ప్లాన్‌ వేరొకరికి ప్రతికూల ఫలితాన్నివ్వొచ్చు. ఎలాంటి డైట్‌ ప్లాన్‌ అనుసరించాలనుకున్నా, ముందుగా వైద్యుల్ని కలవాలి. వారి పర్యవేక్షణలో, వారి సూచన మేరకు పరీక్షలు చేయించుకుని డైట్‌ ప్లాన్‌ అనుసరించాలి. డైట్‌ చేస్తున్నంతకాలం క్రమం తప్పకుండా వైద్యుల్ని కలుస్తూ శరీరావసరాలకు తగ్గట్టు డైట్‌ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి


వీరమాచనేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్ Veeramachaneni Ramakrishna Diet Plan, VRK Diet Plan.

ఆహారము మొత్తం రెండు రకాలు

 • ఒకటి ఘన ఆహారము   = నమిలి తినేటివి అన్ని ఘన ఆహారాలే
 • ఇంకొకటి  ద్రవ ఆహారము  కొవ్వు (నూనె బట్టర్ ….), సూప్ గ్రీన్ టీ   చీజ్ అన్ని ద్రవ ఆహారము   క్రిందికి వస్తాయి
  • సాలిడ్ డైట్ లో ఉన్నప్పుడు లిక్విడ్స్ తీసుకోవొచ్చు కానీ లిక్విడ్ డైట్ లో ఉన్నప్పుడు సాలీడ్స్ తీసుకోకూడదు

తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారము వీటినే వీరమాచనేని గారు పిల్లర్స్ అని అంటారు

 1. పిల్లర్ 1- ప్రతి  రోజు 70-100g  కొవ్వు ,
 2. పిల్లర్ 2: – ప్రతి  రోజు మూడు నిమ్మకాయలు
 3. పిల్లర్ 3: – ప్రతి  రోజు నాలుగు లీటర్స్ నీళ్లు
 4. పిల్లర్ 4: – ప్రతి  రోజు ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్  & ద్రవ ఆహారం వారికి  రెండు  మల్టీవిటమిన్ టాబ్లెట్లు

పిల్లర్ 1- ప్రతి  రోజు 70-100 గ్రాముల  కొవ్వు

 • కొబ్బరి నూనే
 • నాటు  ఆవు నెయ్యి
 • వెన్న
 • ఆలివ్ నూనె
 • పెరుగు మీది మీగడ
 • గమనిక
  • కేవలం కొబ్బరి నూనె మాత్రమే 100% ఫలితాన్ని ఇస్తుంది
  • ఆలివ్ ఆయిల్, ఇది వంట కోసం ఉపయోగించబడదు, సలాడ్లు కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. ఆలివ్ నూనె వేడి చేయకూడదు
  • చీజ్ కొవ్వుగా పరిగణించబడదు, వంట కోసం కూడా చీజ్ ఉపయోగించవచ్చు  చీజ్ నేరుగా తినవచ్చు  చీజ్ మొదటి 10 రోజులు అనుమతించబడదు.
  • పనీర్ కొవ్వుగా పరిగణించబడదు, పనీర్ -100% ప్రోటీన్, పనీర్ రోజుకు  0 నుండి 100 గ్రాములు తినవచ్చు
  • సూప్ ద్వారా కొవ్వును తీసుకోవడము వల్ల  చాలా సులువైన పద్దతి

పది రోజుల తరువాత కొవ్వు తప్పకుండా  తగ్గించాలా?

 • పది రోజుల తరువాత అవసరాన్ని(నీరసాన్ని) బట్టి కొవ్వు వాడకాన్ని తగ్గించవచ్చు.
 • ఇది వారి వారి శరీర అలసటను ను బట్టి ఉంటుంది, చాలా అలసట అనిపిస్తే ఒక పది గ్రాముల కొవ్వు తీసుకోండి. సూప్ ద్వారా కొవ్వును తీసుకోవడము వల్ల  చాలా సులువుగా  తీసుకొంటారు
 • నేను పది రోజుల తరువాత కొవ్వు, 40  ను నుండి 70  గ్రాములు తీసుకున్నాను

పిల్లర్  2- మూడు నిమ్మకాయలు & నిమ్మకాయ పడనివాళ్లు రోజుకు రెండు  సి విటమిన్ మాత్రలు  తీసుకోవాలి.

 • నిమ్మకాయ పడనివాళ్లు గోరువెచ్చని నీటిలో తీసుకోవచ్చు అదికూడా పడనివాళ్లు రోజుకు రెండు సి విటమిన్ మాత్రలు వేసుకోవాలి. చప్పరించే సి విటమిన్ మాత్రలు తీసుకోకూడదు
 • నిమ్మకాయలను ఏ విధంగానైనా తీసుకోవచ్చు మజ్జిగలో సోడాతో  నీటితో సూప్ తో  ఏ రకంగానైనా తీసుకోవచ్చు.
 • సోడా నిమ్మకాయ   తో సహా  తాగవచ్చు కానీ అందులో ఉప్పు వేయకూడదు

పిల్లర్  3- రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు  త్రాగాలి

 • నీళ్లను ను ఎలా అయినా తీసుకోవచ్చు మజ్జిగలో ఉన్న నీళ్లు కూడా ఈ నాలుగు లీటర్ల లెక్కలోకి వస్తాయి. నిమ్మకాయ తో కలిపి తీసుకున్న నీళ్లు కూడా ఈ లెక్కలోకి వస్తాయి
 • సూప్ లో ఉన్న నీళ్ళు ఈ లెక్కలోకి రావు

పిల్లర్  4- ఘనాహారం తీసుకునేవాళ్లకు రోజుకు ఒక మల్టీవిటమిన్ మాత్ర  ద్రవ ఆహారం తీసుకునేవాళ్లకు రోజుకు 2 మల్టీవిటమిన్ మాత్రలు వేసుకోవాలి


నియమాలు

 • ఐఓడీజ్డ్ కానీ  సముద్రపు  కల్లుప్పు / ఐఓడీజ్డ్ కానీ  సముద్రపు  కల్లుప్పు రాళ్ల ఉప్పు/ Non-Iodized Crystal Sea Salt
 • మాంసాహారం తీసుకునే వాళ్ళు తప్పకుండ కూరగాయలు తీసుకోవాలి
 • ఈ క్రింది కూరగాయలు తీసుకోకూడదు
  • ఆలుగడ్డ చామ  కంద పెండలం చిలగడ బీట్రూట్ కూర అరటి  బీన్స్  నాటుచిక్కుడు బఠాణి
 • పాక్షికంగా క్రింద కూరగాయలు తీసుకోవొచ్చు: –
  • టొమాటో రోజుకు 1 ఉల్లిపాయ రోజుకు 1 క్యారట్ రోజుకు 1
 • పైన చెప్పిన మినహా అన్ని ఇతర కూరగాయలను  తీసుకోవొచ్చు.
 • మీరు ఆకలితో ఉన్నప్పుడే తినండి .
  • ఆకలి తీరేవరకు మాత్రమే తినండి
  • మళ్ళీ ఆకలితోఉన్నప్పుడే మళ్ళీ తినండి
  • ప్రతి గంటకోసారి రెండుగంటలకోసారి తినకూడదు.
  • తిండికి సమయము లేదు ప్రొద్దున రెండు అయినా రాత్రి పన్నెండు అయినా సరే
 • మజ్జిగా చేసేపద్ధతి
 • 2 స్పూన్లు పెరుగు + 1 ltr నీళ్లు
  • ఉప్పును చేర్చవద్దు.
  • ఇష్టమైతే, అల్లం + వెల్లుల్లి + నిమ్మ + మిర్చి + కొత్తిమీర + కరివేపాకు + డబ్బాకు +జిలకర +నిమ్మకాయ మొదలగు నవి వాడవచ్చు
 • గరం మసాలా
  • బైట కొనకూడదు
  • ఇంట్లోనే ఈ క్రింది వస్తువులతో తయారుచేసుకోవొచ్చు గసగసాలు , ధనియలు యాలకులు , లావంగాలు దాల్చిన
 • మారినేషన్ పద్దతి
  • ఉప్పు, మిరపపొడి , పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్
  • సాస్, కలర్, పెరుగు వేయకూడదు
  • డీప్ ఫ్రిజ్ లో 2 గంటలు పెట్టండి పైన పేర్కొన్న నూనెలో ఫ్రై చేయండి

ఈ క్రింది డ్రై ఫ్రూప్ట్స్ మీ శక్తి స్థాయిల ఆధారంగా మరియు మీ జీర్ణ సామర్థ్యంపై అవసరాన్ని బట్టి తీసుకోండి

 1. బాదాం రోజుకు 0 నుండి పది,రాత్రి నానపెట్టి ప్రొద్దున తిన్నట్లైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది
 2. పిస్తా రోజుకు 0 నుండి పది (ఉప్పు తో ఉన్నవి లేదా ఉప్పు లేనివి), ఉప్పు లేనివి రాత్రి నానపెట్టి ప్రొద్దున తిన్నట్లైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది
 3. వాల్నుట్స్ రోజుకు 0 నుండి పది ( స్పాండిలైట్స్ ఉన్నవాళ్లకు పదిహేను) రాత్రి నానపెట్టి ప్రొద్దున తిన్నట్లైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది
 4. గుమ్మడి  గింజలు రోజుకు  0 నుండి 5-6 చెంచాలు  ,
 5. పొద్దు  తిరుగుడు  గింజలు రోజుకు 0 నుండి 5-6 చెంచాలు  ,
 6. పుచ్చపప్పు  రోజుకు  0 నుండి 5-6 చెంచాలు రోజుకు  0 నుండి 5-6 చెంచాలు  .
 7. తెల్ల  నువ్వులు
 8. అవిసె  గింజలు
  1. తెల్ల  నువ్వులు 1/4 kg  మరియు అవిసె  గింజలు  1/4 kg పొడిచేసి రోజుకు  0 నుండి -6 చెంచాలు
 9. ఎండుకొబ్బరి , పచ్చి (ముదురు ) కొబ్బరి  రోజుకు సగం  చిప్ప. కొబ్బరిని కొట్టినప్పుడు రెండు ముక్కలు వస్తాయి అంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క రోజు అన్న మాట

 

మునిగాకు రోజు తీసుకొన్నచో చాలా మంచిది

 

ఈ క్రింది పదార్థాలుము తీసుకోకూడదు

 • చిక్కటి మజ్జిగ, పాలు పెరుగు పాలు మీగడ, కూల్ డ్రింక్స్ , తీపి ( శర్కర, బెల్లం, తేనె, కృత్రిమ తీపి), వంటల్లో వేసే రంగు, మక్కజొన్న, సాస్, కొబ్బరి నీళ్లు, చంతపండు, నవధాన్యాలు మరియి వాటి ఉత్పత్తులు ,  తాలింపులో వేసే మినపపప్పు, టేస్టింగ్ సాల్ట్, ఆజ్ఞమమోటో, పళ్ళు, పళ్ళ రసాలు, కూరగాయల రసాలు, అన్ని రకాల పప్పు దినుసులు ( కంది, సన్నగా, పెసలు…..) బీన్స్, కొబ్బరి పాలు, మిల్లెట్స్ (కొర్రలు ఈదలు అరికలు సమ్మెలు సజ్జలు రాగులు మక్కజొన్న, పజ్జోన్న …..)
 • పాలమీగడ, పెరుగు, పాలు, వంట చేయడానికి వాడవచ్చు, తోటకూర ఫ్రై చేసేటప్పుడు మీగడ బాగుంటుంది

సరే డేట్ ఫిక్స్ చేసాము డైట్ మొదలు పెడదామని, మొట్టమొదట చేయాల్సిన పని

 • ఎలాంటి ఆహారము తీసుకోవాలో నిర్ణయించుకోవాలి, ఘన ఆహారము (Solid) లేదా ద్రవ ఆహారము  (liquid ), దానికి తగ్గట్టుగా పదార్థాలు కొనాలి
 • అన్ని పదార్థాలు కొనుగోలు మరియు మీ వంటగది లో తగిన డబ్బాల్లో ఉంచండి
 • డ్రై ఫ్రూప్ట్స్, కొవ్వు, ఉప్పు.నిమ్మకాయలు, కూరగాయలు
  • ఉప్పు,కొబ్బరి నూనె పొందడం కష్టంగా ఉంటే,ఆన్లైన్లో (అమెజాన్) కొనుగోలు చేయవచ్చు, నేను ఇదే  వాడుతున్నాను
  • అమెజాన్


డైట్ మొదలు పెట్టాల్సిన రోజు రానే వచ్చింది  ఆ రోజు ఏమి చేయాలి అనేది పెద్ద గందరగోళం

 • టీ కాఫీ అలవాటు ఉన్నవాళ్లు ప్రొద్దున లేవగానే, శర్కర మరియు పాలు లేకుండా తాగొచ్చు, బులెట్ ప్రూఫ్ టీ లేదా కాఫీ తాగవచ్చు
 • బులెట్ ప్రూఫ్ టీ లేదా కాఫీ లో ఉన్న కొవ్వుకు మాత్రము లెక్క ఉంది
 • ఏమి తినాలి , ఏమి తాగాలి అన్నది పెద్ద ప్రశ్న

లిక్విడ్డై ట్ లో ఉన్నవాళ్లు,

 • పైన చెప్పిన కూరలతో సూప్ చేసుకొని ఆకలి అయినప్పుడల్లా సూప్ తాగాలి, సూప్ ఎన్నిసార్లు ఆయన తాగవచ్చు, దానికి లెక్క లేదు
 • సూప్ లో ఉన్న కొవ్వుకు మాత్రము లెక్క ఉంది

సాలిడ్ డైట్ లో ఉన్నవాళ్లు,

 • పైన చెప్పిన కూరలతో ఎదో ఒక కూర చేసుకొని తినాలి
  • కూరలను ఏ విధంగానైనా చేయవచ్చు
  • ఉప్పు, కారం మసాలా నోటికి రుచికి తగ్గట్టు వేసుకోవొచ్చు
  • నూనె మాత్రము పైన చెప్పినవే వాడాలి
  • కూరలలో డ్రైఫ్రూప్ట్స్ పొడి ని కూడా వేసుకోవొచ్చు
 • పైన చెప్పిన డ్రై ఫ్రూప్ట్స్ తినవచ్చు,
  •  డ్రై ఫ్రూప్ట్స్ దోస, డ్రై ఫ్రూప్ట్స్ రోటి తినవచ్చు  ఎలా చేయాలో త్వరలో చెప్తాము
 • సూప్ కూడా తాగవచ్చు
  • సాలిడ్ డైట్ లో ఉన్నప్పుడు లిక్విడ్స్ తీసుకోవొచ్చు కానీ లిక్విడ్ డైట్ లో ఉన్నప్పుడు సాలీడ్స్ తీసుకోకూడదు
 • ఎన్నిసార్లు తినాలి అన్నది మరియుక సంశయము,
  • వన్ మీల్
  • టు మీల్
  • త్రి మీల్
  • ఎదో ఒక విధానాన్ని ఎంచుకోవాలి
  • ఒక్క బాదాం గింజ తిన్న అది ఒక మీల్ గ లెక్కించడము జరుగుతుంది , కాబట్టి సాలీడ్స్ అన్ని ఒకేసారి తినటం మంచి పద్దతి
  • టు మెయిల్ ఎంచుకొన్నపుడు, అప్పటికే టు మీల్స్ తిన్నాము లేదా సెకండ్ మీల్స్  కాలేదు, ఇప్పుడు ఆకలి అయితే ఏమి చేయాలి.
   • సూప్ తాగాలి, సూప్ ఎన్నిసార్లు ఆయన తాగవచ్చు, దానికి లెక్క లేదు
   • సూప్ లో ఉన్న కొవ్వుకు మాత్రము లెక్క ఉంది

 


 

 

 

7 Comments

 1. Good information. Personal experience documented with honest intention. Keep updating the site. Useful for all.

  • Hi Ramachandra Sarma Garu
   Thanks for your positive comments
   Your feedback is extremely valuable as it helps us to improve the content.

 2. Very nice sir. Keep it up. This site will give us more information in future for those who want to follow the diet

Leave a Reply

Your email address will not be published.