పరిచయం

అందరికి నమస్కారములు

 • కొన్ని సంవత్సరాలనుండి మధుమేహము తో బాధపడుతున్నాను, మధుమేహము నుండి శాశ్వత నివారణ కొరకు వెదుకుతూ ఉంటే, వీరమచనేని రామకృష్ణ గారి డైట్ గురించి తెలుసుకున్నాను. అదే క్రమంలో డాక్టర్ పీవీ సత్యనారాయణగారిని కూడా సంప్రదించాను.
 • మనము అనారోగ్యము తో పాటు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటాము దానిద్వారా అనుభవాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదిస్తాము. పొందిన అనుభవాన్ని& జ్ఞానాన్ని ఇతరులకు తెలియచేయడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందనిపించింది ఈ ఆలోచన రూపమే ఈ వెబ్సైటు
 • ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము,
  • స్కూల్ లో పిల్లలను జాయిన్ చేసేటప్పుడు, స్కూల్ లో ఏమేమి చూడాలి?
  • వేపపుల్లతో పళ్ళు తోముకుంటే మంచిదని తెలుసు కానీ ఎలా వాడాలి?
  • ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా వెబ్సైటు లో ఉంచాలనుకుంటున్నాను.
 • చాలా మంది నాకు వెబ్సైటుపేరు గుంచి సలహా ఇచ్చారు, వాళ్లందరికీ ధన్యవాదములు కానీ ఈ వెబ్సైటులో, ఆహారం ఆరోగ్యము మాత్రమే కాకుండా, చాలా రకాలైన సమాచారం ఉంటుంది మరియి వెబ్సైటు తెలుగువారికి మాత్రమే పరిమితము కాదు కాబట్టి, చాలా సులుగువా ఉండే విధంగా https://braghu.com అని పేరు పెట్టడము జరిగింది.
 • ఏవైనా సూచనలు ఉంటె మీరు కామెంట్ ద్వారా తెలియపర్చవచ్చు లేదా నాకు మెయిల్ పంపవచ్చు contact@braghu.com
 • ఇందులో వ్యక్తిగత అనుభవాలను, ఇతరులకు సమాచారం కొరకు మాత్రమే పొందుపర్చడము జరిగింది, వీటిని యథా తథము ఆచరించకూడదని నా మనవి.

ఆరోగ్యకరమైన (మానసిక + శారీరక) సమాజం కోసం నా వంతు ప్రయత్నము చేస్తూ అలాగే ఈ వెబ్సైటు అనేది ఒక ఓపెన్ ఫోరమ్ కాబట్టి ఎవరైనా వారి వారి అనుభవాలను & జ్ఞానాన్ని కామెంట్స్ (వ్యాఖ్యలు) రూపంలో ఉంచినట్లయితే, వేరేవారికి సమాచారనిమిత్తమై ఉపయోగపడుతుంది. రోజువారీ సమస్యలకు అన్నింటికీ ఇందులో సమాచారం ఉన్నప్పుడే దీనికి ఒక రూపం వస్తుంది, అది మనఅందరి సహకారం తో మాత్రమే పూర్తవుతుంది.

ఈ వెబ్సైటు అందరికి ఉపయోగపడాలని ఆశిస్తూ. మీ అందరి సహకారము కోరుతూ

బి  రఘు